NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కల్వరి కొండ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.మండలంలోని ఆర్ సిఎం,సిఎస్ఐ,ఏబీఎం తదితర చర్చిలలో క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.ఉప్పలదడియ ఆర్సిఎం విచారణ పరిధిలో ఉన్న 10 గ్రామాల్లో ఉప్పలదడియ,కడుమూరు, 49 బన్నూరు,దేవనూరు, కేతవరం,పైపాలెం,చౌటుకూరు ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు విచారణ గురువులు ఫాదర్ డి మధుబాబు దివ్యబలి పూజను సమర్పించారు.దిగువపాడు గట్టు పైన ఉన్న కల్వరి కొండ గుడి దగ్గర సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.అనంతరం అక్కడే కేక్ కట్ చేశారు. తర్వాత ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను విచారణ గురువులు ప్రధానం చేశారు.చిన్నారులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో బ్రదర్లు థో మాస్,మరియదాస్,విచారణ పెద్దలు ఆనందరావు,పక్కీరయ్య,జాన్,ఫ్రాన్సిస్ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author