PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ బరక సంజీవరాయుడికి ప్రత్యేక పూజలు

1 min read

– తువ్వా బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం -భారీగా హాజరైన భక్తాదులు మరియు నాయకులు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో శ్రీ బరక సంజీవ రాయుడు ఆలయంలో శుక్రవారం రోజున అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా పూజలో నిర్వహించారు. ఉదయం నుంచే పిల్లలు మహిళలు భక్తాదులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో ఆలయంలో ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు.ఈపూజల్లో మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఆలయ ధర్మకర్త పేరెడ్డి మురళిమోహన్ రెడ్డి,వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ నాగతులసి రెడ్డి,నాగలూటి  సర్పంచ్ ఉషారాణి,రోళ్ళపాడు పేరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.కీ.శే తువ్వా రామిరెడ్డి వారి ధర్మపత్ని తువ్వా సీతమ్మ ఆధ్వర్యంలో తువ్వా రఘునాథరెడ్డి,రవీంద్రనాథరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,తువ్వా రామ నాగేశ్వర రెడ్డి,తువ్వా వెంకట నాగిరెడ్డి వచ్చిన భక్తులందరికీ వారు భోజన విందును ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు చిన్న రామచంద్రారెడ్డి,ఎంపీటీసీ హరి సర్వోత్తమ్ రెడ్డి,రామలింగేశ్వర రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి,భూపాల్ రెడ్డి,మర్రి రామకృష్ణ,శంకర్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

About Author