డయల్ యువర్ డి.పి.టి.ఓ కు ప్రజలనుంచి విశేష స్పందన..
1 min readనిరంతర ప్రజా సేవలో ఆర్టీసీ పనిచేస్తుంది..
డి పి టి ఓ వరప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ డి పి టి ఓ కు విశేష స్పందన : లభించింది.ప్రజలునుండి వచ్చిన వివిధ సమస్యల్లో సమద్. చింతలపూడిసమస్య: చింతలపూడి నుండి విజయవాడకి ఉదయాన్నే ఎక్స్ ప్రెస్ సర్వీసు కావలెను .సమాధానం: తప్పకుండా పరిశీలించి ఏర్పాటు చేస్తాం.రంగు సుబ్బారావు.నూజివీడు.సమస్య: రమణక్క పేట మీదుగా బీహెచ్ఈఎల్, జీడిమెట్ల బస్సు కవెలెను.సమాధానం: రూట్ సర్వే చేసి ఏర్పాటు చేస్తాం.సింహాద్రి సత్యనారాయణ,ఉంగుటూరు మండలం తిమ్మాయపాలెం.సమస్య: ప్రస్తుతం నడుస్తున్న ఆకుపల్లి గోకవరం బస్సు తిమ్మా యిపాలెం వరకు పొడిగించాలి. స్కూల్ విద్యార్థులు ఎక్కువ ఉన్న కారణం చేత కోరడమైనది .సమాధానం: హెడ్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుని తప్పకుండా కొనసాగిస్తాంఇసాక్ సయ్యద్,ధర్మాజీగూడెం.సమస్య:కొత్తగూడెం భద్రాచలం వెళ్ళుటకు బస్సులు కావలెను .సమాధానం:రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం మణుగూరు,భద్రాచలం డిపోల నుండి బస్సులు తిరుగుతున్నవి. మన ఆంధ్ర బస్సు లు తిరగడానికి కొంత సమయం పడుతుంది.హరి ప్రసాద్ మల్లపాలెంసమస్య: వలసపల్లి ,అక్కిరెడ్డిగూడెం,మీదుగా చింతలపూడి బస్సు కావలెను. సమాధానం: రూటు సర్వే చేసి తప్పకుండా బస్సు ని ఏర్పాటు చేస్తాం. ఎండి అజీజ్ చింతలపూడి.సమస్య:సత్తుపల్లి నుండి చింతలపూడి కి సాయంత్రం 6:30 దాటిన తర్వాత బస్సు లేదు టైం మార్చగలరు. సమాధానం:టైమని 6:30 నుండి 7:30 కి మార్చడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది .డయల్ యువర్ డిపిటివోకు చింతలపూడి , విజయవాడ నుండి 12 కాల్స్ వచ్చాయని, వాటిని పరిష్కారం చేస్తామని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్.వి.అర్.వరప్రసాద్ తెలియజేశారు.