PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష కి విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు ను సందర్శించారు అక్కడికి ఓపి నాలుగువందల ఒక్క మంది వచ్చారు మరియు గర్భవతులు 24 మందిని చెకప్ లు చేశారు. కంటికి సంబంధించి 62 మందికి చెకప్ లు చేశారు 28 మందికి అద్దాలు పంపిణీ చేశారు మరియు స్కూల్ పిల్లలు 11మంది చెకప్లకు వచ్చారు మరియు పోషక ఆహారం లోపం ఉన్న మ్యామ్ శామ్ పిల్లలు  12 మంది వచ్చారు మొత్తం ఓపి 401 వచ్చినారు వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 11 మందిని ఉన్నత వైద్య సేవల కోసం రెఫర్ చేశారు జగనన్న వైద్య ఆరోగ్య శిబిరము ప్రజలందరూ పాలుపంచుకొని వైద్య సేవలు అందించుకున్నందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వైద్య సేవలు అందించిన వైద్యాధికారులకు వైద్యసిబ్బందికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

About Author