ఉచిత వైద్య శిబిరానికి విశేషస్పందన..
1 min readగ్రామ ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం…కె.సి.తిమ్మారెడ్డి వారసులు..
పల్లెవెలుగు వెబ్ హోలగుంద : మండలంలోని ఇంగలదహల్ గ్రామంలో స్వర్గీయులు “దేవరగట్టు ఆలయ మాజీ చైర్మన్, శ్రీశైల ఆలయ మాజీ చైర్మన్, ఆస్పరి మండల సమితి మాజీ అధ్యక్షులు శ్రీ కె.సి.తిమ్మారెడ్డి గారి జయంతి సందర్భంగా” తిమ్మారెడ్డి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉచిత వైద్య శిబిరం కర్నూలు ఒమిని హస్పెటల్ వైద్యనిపుణుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య ఆతిథులుగా కె సి తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి కె.కార్థిక్ రెడ్డి మరియు హోమ్ని హాస్పిటల్ ప్రత్యేక వైద్యులు గుండె వైద్య నిపుణులు కె.ఇందు ప్రకాష్ రెడ్డి,అఖిల్ రానా కేసరి పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరాన్ని చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కూడా రావడం జరిగింది.గుండె సంబంధిత చికిత్సలు ఈ సి జి కూడా తీసి మందులు పంపిణీ చేయడం జరిగింది.ఇతర ఆరోగ్య సంబంధిత చికిత్సలు కూడా చూసుకోవడం జరిగింది.అలాగే వినోద్ ఊసేన్ పిరా అద్భుత్ కుమార్ లు రక్త పరీక్షలు నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యాన్ని అనేకమంది ప్రజలు సద్వనియోగం చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో హోమ్ని హస్పెటల్ సిబ్బంది రక్త,నరాలు పరీక్ష సంబంధించిన సిబ్బంది మరియు ఎంపీటీసీ మల్లికార్జున హాస్టల్ వార్డెన్ శివుడు గ్రామ పెద్దలు యూత్ అధ్యక్ష కార్యదర్శులు విరేష్,చంద్రశేఖర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.