శ్రీ శంకర భగవత్ పాదులకు విశేషముగా షోడశోపచార పూజలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జయ గురుదత్త శ్రీ మాత్రేనమః శ్రీ గురుదత్త శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ శంకర జయంతి మరియూ శ్రీ జయలక్ష్మీ మాత జయంతి పర్వదినం సందర్భంగా శ్రీ జయలక్ష్మీ మాతకు విశేష అలంకరణ మరియూ దివ్యపాదుకలకు విశేష అభిషేకములు, అర్చనలు జరుపబడినవి. అనంతరము శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వరూపిణి అయిన జయలక్ష్మి మాత ప్రీత్యర్థం సామూహిక సువాసిని పూజలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమములో మాతృమండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు మరియూ శ్రీ శంకర జయంతి సందర్భంగా శ్రీ గౌరీ శంకర స్వామి వారికి విశేష పంచామృత అభిషేకము లఘున్యాస పూర్వక రుద్రాభిషేకము. ఆరుద్ర నక్షత్రము పురస్కరించుకొని అన్నాభిషేకము శ్రీ శంకర భగవత్ పాదులకు విశేషముగా షోడశోపచార పూజలు జరుపబడినవి. పూజా కార్యక్రమంలో అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ మరియూ ఆలయ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రసాద వితరణ చేయడం జరిగినది. పై కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు మాతృమండలి సభ్యులు భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీ శంకర కృపకు శ్రీ జయలక్ష్మి మాత కృపకు పాతృలైనారు.
