PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రౌడిషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా..

1 min read

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలి.

ముచ్చుమర్రి , బ్రాహ్మణకోట్కూరు,పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనికీ చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ  కె. రఘువీర్ రెడ్డి ఐపీఎస్. 

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్  రెడ్డి ఐపిఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్, నందికొట్కూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ముచ్చుమర్రి , బ్రహ్మణకొట్కూరు  పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ఐపీఎస్ మంగళవారం  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు  .ఈ సందర్భంగా స్టేషన్  నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.  రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సీఆర్.పీసీ, తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో  నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్య మైన కేసులు మరియు పాత గ్రేవ్  కేసులను సమీక్షించారు. స్టేషన్ లోని క్రైమ్ రికార్డ్స్ ను, కేసు డైరీ మరియు రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన, కేసుల్లో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నిర్దేశిత కాల వ్యవధిలో  కోర్ట్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, సమర్థవంతమైన ట్రయిల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చెయ్యాలని సూచించారు. సివిల్, భూ తగాదాలు, పాత గొడవల్లోని, నాటు సారా అమ్ముతున్నారని అనుమానం ఉన్న వ్యక్తులను గుర్తించి బైండోవర్ చెయ్యాలని సూచించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని,  సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని, అదే విధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పి ఏ. శ్రీనివాసరావు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ,నందికొట్కూరు రూరల్ , అర్బన్ సీఐ లు విజయ భాస్కర్ , ప్రకాష్ కుమార్ , మచ్చుమర్రి ఎస్సై జయ శేఖర్ , బ్రాహ్మణ కోట్కూరు ఎస్సై నాగార్జున  పాల్గొన్నారు. 

About Author