డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా..
1 min read
పలు ప్రాంతాలలో పెట్రోల్ బంకుల దగ్గర జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ఆరా తీస్తున్న పోలీసులు.
నిందితుల కొరకు డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసిన పోలీసులు.
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో నేరాలను నియంత్రించే చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మారుమూల ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంతపాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల దగ్గర జరుగుతున్న నేరాలపై ముమ్మరంగా దర్యాప్తులు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.సబ్ డివిజన్ల వారిగా డ్రోన్ కెమెరాలను పంపి పెట్రోల్ బంకుల వద్ద నిఘా పటిష్టం చేశారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో పెట్రోల్ బంకుల దగ్గర జరుగుతున్న నేరాల గురించి ఆరా తీస్తున్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, నిశిత ప్రాంతాలను, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.