రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ కి ప్రత్యేక ధన్యవాదాలు
1 min read
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా టీడీపీ BC నేత రాజు యాదవ్ నియామకం
కర్నూలు,న్యూస్ నేడు: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్న ఎం.వి.ఎన్ .రాజు యాదవ్ నియమితులయ్యారు. గడిచిన 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ నందు ఎన్నో పదవులు చేపట్టి తెలుగుదేశం పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేసిన సీనియర్ నాయకుడిగా రాజు యాదవ్ జిల్లా ప్రజలకు సుపరిచితం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కొత్త కమిటీని జిల్లా కలెక్టర్ మరియు కమిటీ ఛైర్మన్ పి.రంజిత్ ప్రకటించిన అనంతరం నియామక పత్రాన్ని రాజు యాదవ్ అందుకున్నట్లు తెలియజేశారు.ఈ నేపథ్యంలో రాజు యాదవ్ మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని వొమ్ము చేయకుండా జిల్లా ప్రజల కోసం కృషి చేస్తానని తెలియజేశారు తెలుగుదేశం పార్టీలో తన కష్టాన్ని గుర్తించి ఇందుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ సహాయ సహకార్యాలు అందించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.టి.జి.భరత్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.