PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు

1 min read

– బనగానపల్లె నియోజకవర్గం ప్రైవేటు స్కూలు యజమానులు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె నియోజకవర్గం ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శాలువా కప్పిన అందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.వి.రామచంద్ర రెడ్డి వైయస్సార్ పార్టీ బలపరచడం బనగానపల్లె నియోజకవర్గం లో ఆయన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందని చెప్పారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించిన బనగానపల్లె నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎం.వి.రామచంద్ర రెడ్డి తో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ రెన్యువల్ ను ప్రతి సంవత్సరం చేసుకొనే వారని అయితే జగన్మోహన్ రెడ్డి 8 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్చేసుకోవడానికి వీలు కల్పించేటట్లు జీవోనప్రకటించ డంజరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో బనగానపల్లె ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కమల్ తేజ రెడ్డి, ట్రెజరర్ జిలాని భాష ,సప్తగిరి నాగేశ్వర్ రెడ్డి, రాం పుల్లయ్య, శేఖర్, రవితేజ రెడ్డి, రామసుబ్బారెడ్డి, తిమ్మారెడ్డి, భూపాల్ రెడ్డి, నారాయణస్వామి, రమణ విశ్వనాథరెడ్డి, హుస్సేన్ బేగ్ ,తదితరులు పాల్గొన్నారు.

About Author