బయలువీరభద్రస్వామికి విశేషపూజ
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: ఆర్జితపరోక్షసేవగా శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలువీరభద్రస్వామికి విశేష పూజలు జరిపారు. గురువారం అమావాస్య కావడంతో పరోక్షసేవలో భక్తులు శ్రీశైల దేవస్థానం పాల్గొనే అవకాశం కల్పించబడింది. ఉదయం నుంచి స్వామి వారికి మహాగణపతి పూజ, పంచామృతాభిషేకం, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. అమావాస్య రోజు నిర్వహించే పూజలో భక్తులు పాల్గొని.. పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని ఈఓ లవన్న తెలిపారు.