మద్ది లో వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు..
1 min read– భక్తులకు అన్నదానం,మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు..
– వివిధ సేవలు రూపేణ 1,54, 981/- ఆదాయం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామములొ వేంచేసియున్న శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు శ్రీ హనుమద్ జయంతి సహిత కల్యాణ మహోత్సవములలో భాగంగా ఉదయం గం.5.00 ల నుండి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారికి మరియు ఉప ఆలయం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక పూజలు, తదనంతరం గం.9.00 ల నుండి శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయమునందు ఆలయమువద్ద ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామివారిని, అమ్మవార్లను ఆసీనులను చేసి, అర్చక స్వాములు శ్రీస్వామివారి కల్యాణ క్రతువు నిర్వహించినారు. సదరు కళ్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానము వారిచే ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువులు భక్తులు మజ్జిగను సేవించి సేదదీరినారు. ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,54,981/- లు సమకూరినది. ఈరోజు ఆలయమునకు విచ్చేసిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదానసత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహనకృష్ణ (బాబీ), కర్పూరం రవి, శ్రీమతి జెట్టి దుర్గమ్మ,శ్రీమతి బల్లే నాగలక్ష్మి – పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెల్పినారు.
రేపటి రోజున అనగా ది.17.05.2023 వ తేది:- బుదవారం ఉదయం గం.6.00 లనుండి సర్వ దర్శనం, ఉ.గం.8.00 కు ఉక్త హోమాలు, గం.9.00 లకు పూర్ణాహుతి తదుపరి ఆలయ ముఖమండపంలో స్వామివారికి అవబృదస్నానము అనంతరం శ్రీస్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం, సాయంత్రం గం.7.00 లకు తెప్పోత్సవం నిర్వహించబడునని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెల్పినారు.