దత్రేయస్వామికి విశేషపూజలు
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: మార్గశిర పౌర్ణమి-దత్తా జయంతి పురస్కరించుకుని లోకకల్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించారు. శనివారం దత్తా జయంతిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఈఓ లవన్న ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మహాగణపతి పూజ చేశారు. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు.
ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు. కాగా దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరి తీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది. శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు. అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ దత్తాత్రేయస్వామివారికి ఈ విశేషార్చనలు నిర్వహించారు.