PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

1 min read

250 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కొండపేట నందు బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది, కీర్తిశేషులు పెడబల్లి సుబ్బారెడ్డి( కొండపేట రెడ్డి) కీర్తిశేషులు పెడబల్లె శివారెడ్డి( మాజీ సర్పంచ్) జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారిచే కొండపేట బంగ్లా నందు బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ఉదయం 9 గంటల నుండి జనం వైద్య శిబిరానికి ఇటు కొండపేట గ్రామ ప్రజలే కాకుండా, చెన్నూరు నుండి కూడా కంటి చికిత్స కొరకు కొండపేటకు రావడం జరిగింది, ,డాక్టర్ జిగీష( ఆర్థమాలజిస్ట్), డాక్టర్ శ్రావణి( ఆర్తమాలజిస్ట్) వెంకటేశ్వర్లు , అఖిల ఆస్ట్రామాలజిస్ట్ ల నేతృత్వంలో ఎల్ఈడి బోర్డ్స్, విజన్ బోర్డ్స్, ఏ ఆర్ మిషన్, ట్రైబ్ బాక్సులు, కంప్యూటర్ లలో కంటికి సంబంధించిన అదునాత టెక్నాలజీ తో ప్రజలకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ,అలాగే శస్త్ర చికిత్సలు నిర్వహించి, అవసరమైన వారికి పుష్పగిరి కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించబడతాయని పుష్పగిరి కంటి ఆసుపత్రి క్యాంపు కోఆర్డినేటర్ అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు, అంతే కాకుండా ఇందులో ప్రత్యేకంగా శుక్లములకు ఆధునిక ఆపరేషన్, మెల్లకన్ను వారికి ఆపరేషన్, రెటీనా ఆపరేషన్, కార్నియా ఆపరేషన్, గ్లూకోమా( వీటి కాసులు) ఆపరేషన్లు, కంటి ప్లాస్టిక్ సర్జరీ, చిన్నపిల్లల కంటి చికిత్స ఆపరేషన్లు, కంటి శుక్లాలు గుర్తించి వారికి కంటి( కుట్లు లేని) ఆపరేషన్ నిర్వహించబడునని, కాంటాక్ట్ లెన్స్, వంటి మొదలగు శస్త్ర చికిత్సలు, నిర్వహించబడతాయని ఆయన తెలియజేశారు, ఆపరేషన్లు చేయించుకుని వారు ఆధార్ కార్డు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు తప్పక తీసుకురావాలని ఆయన తెలియజేశారు,కంటి ఆపరేషన్లు చేయించుకొను వారికి పుష్పగిరి కంటి ఆస్పత్రి వారి ఉచిత వాహనం అదేవిధంగా భోజన సౌకర్యం తో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, కంటి వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెడబల్లి సుధాకర్ రెడ్డి ,శ్రీధర్ రెడ్డిలు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది, ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా మండలంలోని పలువురు వైయస్సార్సీపి, తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి నాయకులు రావడం జరిగింది, కీర్తిశేషులు పెడబల్లె సుబ్బారెడ్డి( కొండపేట రెడ్డి) కీర్తిశేషులు పెడబల్లె శివారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వారి కుటుంబ సభ్యులు పెడబల్లె సుధాకర్ రెడ్డి, పెడబల్లె శ్రీధర్ రెడ్డిలు తెలియజేశారు.

About Author