ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి : ఎంపీడీఓ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు : ప్రతి శనివారం హౌసింగ్ డే సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మాసపేట పరిధిలోని కలమందలపాడు జగనన్న కాలనీ లేఔట్ ను ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఇంచార్జి హౌసింగ్ ఏఈ జె.రమేష్ ఇండ్ల నిర్మాణాలను వారు పరిశీలించారు.ప్రభుత్వం అందిస్తున్న సామగ్రి ఉపయోగించుకుని ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అలాగే ఇల్లు పూర్తి అయిన లబ్ధిదారులు విద్యుత్ మీటర్ కనెక్షన్ ఉచితంగా పొందవచ్చని ఎంపీడీఓ లబ్ధిదారులకు తెలియజేశారు.తదనంతరం మాసపేట సచివాలయంలో ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.కలెక్టర్ గారి అదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి,విఆర్వో,వెల్ఫేర్ అసిస్టెంట్,మహిళ సంరక్షణ కార్యదర్శి,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమకి కేటాయించిన లబ్ధిదారులతో ప్రతిరోజూ మాట్లాడుతూ లబ్ధిదారులను ఒప్పించే విధంగా చూడాలని ఇల్లు త్వరగా పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో రాఘవేంద్ర, డిజిటల్ అసిస్టెంట్ పాల్గున,వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.