PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల రికార్డుల వెరిఫికేషన్ వేగవంతం చేయండి

1 min read

ఇంచార్జ్ భూపరిపాలన ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫీ హోల్డ్ అసైన్డ్ భూముల రికార్డుల వెరిఫికేషన్ త్వరితగతిన  పూర్తి చేయాలని ఇంచార్జ్ భూపరిపాలన ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అన్ని జిల్లాల  కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి ఇంచార్జ్ భూపరిపాలన ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ భూపరిపాలన ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలలో అసైన్డ్ భూముల రికార్డుల వెరిఫికేషన్ వేగవంతం పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్ లకు సూచించారు. ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల రికార్డ్ వెరిఫికేషన్ కి సంబంధించి రోజువారీ ప్రగతిని పరిశీలించుకోవాలన్నారు, జిల్లాలో ఈనామ్ భూములకు సంబంధించిన ఎల్ పి ఎం పనులు, ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములకు సంబంధించిన ఈ కేవైసీ అంశాల గురించి జిల్లాలో రివ్యూ నిర్వహించుకుని సంబంధిత పనులు పెండింగ్ లేకుండా  చూసుకోవాలన్నారు. ల్యాండ్ టైటిల్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు ప్రతి జిల్లా నుండి ఇద్దరు నోడల్ ఆఫీసర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంటి స్థలాలను గురించి జిల్లాలో రివ్యూలు నిర్వహించుకుని వెబ్ సైట్ నందు అప్డేట్ చేసుకోవాలన్నారు. భూ సేకరణకు సంబంధించి పూర్తి వివరాలను తగిన ఫార్మేట్లో సమర్పించాలని తెలియజేశారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్ భూముల రికార్డ్స్ వెరిఫై చేస్తున్నామని, జిల్లాలోని అన్ని గ్రామాలలో పూర్తి చేసిన డేటా ఉందని, వాటికి సంబంధించి గ్రామాల వారీగా కూడా సమీక్షలు నిర్వహించుకుని త్వరగా రికార్డులు వెరిఫికేషన్ పూర్తి చేస్తామనిఇంచార్జ్ భూపరిపాలన ప్రధాన కార్యదర్శి కి జాయింట్ కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ మధుసూదన్ రావు,తదితరులు పాల్గొన్నారు.

About Author