NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

1994-95 విద్య సంవత్సరపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

1 min read

పల్లె వెలుగు ఆత్మకూరు: 1994 – 95 విద్య సంవత్సరపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆత్మకూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలువురు పూర్వవిద్యార్థులు అందరూ కలిసి ఆనాటి గురువులతో కలిసి తమ పూర్వ అనుభవాలను ఒకసారి గుర్తుకు చేసుకొనేందుకుఈ వేదిక చక్కగా ఉపయోగపడిందని అన్నారు. పూర్వ విద్యార్థులు తమ గురువులను సన్మానించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ఈ విద్య సంవత్సరం లో పదవ తరగతి లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాలుడికి పదివేల రూపాయలు బహుమతి గా ప్రకటించారు. అలాగే తమ స్నేహితులలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలని అందరూ కలిసి తీర్మానించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వహణ కమిటీ సభ్యులైన వరప్రసాద్,సాజిద్,ధర్మారెడ్డి,రామిరెడ్డి,షైక్షావాలి, వాసుదేవరెడ్డి, పుల్లయ్య మొదలైన వారికి సన్మానించారు.

                                    

About Author