విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానికం ఆదోని రిక్రియేషన్ క్లబ్ శ్రీ అశ్వత్థ నారాయణ దేవాలయం కళాభారత్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని కరాటే యోగ బాక్సింగ్ వెపన్స్ కర్ర సాము వంటి అంశాలను ఉచిత శిక్షణ ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు ఎన్.ఆర్.ఐకాకుబాల్ నాగేష్ ప్రారంభించి బాక్సింగ్ సంబంధించిన క్రీడా పరికరాలను వితరణ చేయడం జరిగింది. సేవా దృక్పథం కలిగిన ఏ కార్యక్రమానికైనా ఆదోనిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మరియు శిక్షణ పిల్లలకు ఎంతో ఉపయోగకరమని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం వల్ల సమాజంలో శక్తివంతమైన వ్యవస్థ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ సిఆర్ స్వామి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని అవి మనిషి యొక్క జీవనాన్ని ఉత్సవంగా చేస్తాయని తెలియజేశారు. కళాభారత్ సేవా సమితి వారు చేయుచున్న యొక్క ప్రక్రియను కొనియాడారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గుడికల్ కుమారస్వామి విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు తలారి ఆంజనేయులు ఈరన్న కొండ స్వయంభూ నరసింహ స్వామి ఆలయ ధర్మకర్త ప్రతాప్ స్వామి కేశవ మాస్టర్ శివకుమార్ చందు మహేష్ తదితరులు పాల్గొన్నారు.