క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని,స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు.గురువారం నందికొట్కూరు పట్టణంలో నిర్వహిస్తున్న జగనన్న సంక్రాంతి క్రిడా సంబరాలు 2023 లో భాగంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో కృషి ,పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునన్నారు క్రీడల ద్వారా మంచి క్రీడాకారుడికి సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ స్థాయి జగనన్న సంక్రాంతి క్రీడా సంబరాలలో భాగంగా కబడ్డీ పోటీలకు గౌరవ అథిదులుగా సీఈఓ రమణ ,మున్సిపల్ కమీషనర్ కిషోర్ ,రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి ,మిడుతూరు జడ్పీటీసీ పర్వతనేని యుగందర్‌రెడ్డి, జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచా జగదీశ్వరరెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, పగిడ్యాల సర్పంచ్ పేరుమాళ్ళ శేషన్న, మాజీ మార్కెట్ యార్ఢ్ చైర్మన్ తువ్వ శివరామకృష్ణా రెడ్డి, కౌన్సిలర్ వీరబోమ్మ రూపాదేవి,నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి,మాజీ కో ఆప్షన్ జబ్బార్,కౌన్సిలర్ లు నాయబ్, రావూప్, చిన్నరాజు, కొండ్రెడ్డి విజయమ్మ,లక్ష్మదేవి, చిన్నరాజు,హామీద్, శివనాగిరెడ్డి,చాంద్ భాష,కృష్ణ,సర్పంచ్ నాగస్వామి రెడ్డి,ఐటి వింగ్ జిల్లా అద్యక్షులు జగన్ మోహాన్ రెడ్డి,తాటిపాడు తిరుమలేశ్వరరెడ్డి,నాయకులు పాల్గొన్నారు.