PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి

1 min read

– పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
– జిల్లా పరిషత్ బడ్జెట్ ద్వారా పాఠశాలల క్రీడలకు నిధులు మంజూరు..
– జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: బుట్టాయిగూడెం:విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి డా.కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. టిబిఆర్ (తెల్లం బాల రాజు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 5రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డా.కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులలోని ప్రతిభను వెలికితీసేందుకు మండల, గ్రామీణ స్థాయిలలో కూడా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాపోటీలలో అత్యుతమ ప్రతిభ కనపరిచిన వారికి శిక్షణ అందించి వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఇరుకైన భవనాలలో నిర్వహించడంతో క్రీడా సదుపాయాలు ఉండవని, అంతేకాక వారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వరన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పెద్ద క్రీడా మైదానాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లోని క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడంతోపాటు, క్రీడా పరికరాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచి క్రీడల పట్ల విద్యార్థులతో మక్కువ పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రతీ సంవత్సరం తన ఫౌండేషన్ ద్వారా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పేదరికమే అర్హతగా కుల, మత ,రాజీకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించిందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు 600 వందలకు పైగా హామీలిచ్చి నెరవేర్చలేక మానిఫెస్టో ని తమ పార్టీ వెబ్ సైట్ నుండి తొలగించిందన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులకు అందించామన్నారు.జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆహ్లాదం, ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహానికి జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యంపెంపొందుతుందన్నారు. గిరిజన ప్రాంతాలలోని యువతలో దాగిఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 7 గిరిజన మండలాల్లోని యువతకు వాలీబాల్, కబాడీ, విలువిద్య, తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు జనవరి,26వ అర్హులైన ప్రతీ ఒక్కరికీతేదీన బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలలో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.అనంతరం 42 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి డా.కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం 21. 80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ప్రారంభించారు. అంతకుముందు క్రీడా ప్రాంగణంలో జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, శాసనసభ్యులు తెల్లం బాలరాజు మొక్కలను నాటారు.ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వాలీబాల్, విలువిద్య క్రీడలలో సరదాగా పాల్గొని, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోలవరం కరాటం సీతాదేవి, ఎంపీపీ కారం శాంతి రమణ, జడ్పిటిసి మొడియం రామ తులసి, సర్పంచి టి. వెంకయ్యమ్మ ,వైస్ ఎంపీపీలు కుక్కల వరలక్ష్మి గోపి, జి మోహన్ రావు, ఆర్డీవో ఝాన్సీ రాణి కాలేజీ ప్రిన్సిపల్ భక్త హనుమాన్, తాసిల్దార్ ఎస్. శాంతి, ఎంపీడీవో ఇన్చార్జి శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ రమాదేవి, వ్యాయామ ఉపాధ్యాయులు కే వీరస్వామి కే నాగేశ్వరరావు టి వెంకటేశ్వరరావు, పోలవరం నియోజకవర్గ ఏడు మండలాల్లోని 200 మంది క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపీపీలు, జడ్పిటిసిలు ఎంపీటీసీలు కళాశాల అధ్యాపకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author