PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాలుష్యం, కల్మషం లేనివే క్రీడలు.. మాజీరాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

కులమత బేధాలు కాలుష్యం, కల్మషం లేనివే క్రీడలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ ముఖ్యఅతిథిగా హాజరై  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభగల యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీవి సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని అన్నారు.క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు  ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడల అభివృద్ధికి ప్రతి మండలానికి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని తాను ప్రతిపాదించానాని  టీజీ వెంకటేష్ తెలిపారు. అందులో భాగంగా చాలా ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియాలు వెలిసాయని, వీటివల్ల గ్రామీణ క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగముందన్నారు. తమ వంతుగా క్రీడల అభివృద్ధి కోసం టీజీవి సంస్థల ఆధ్వర్యంలో అనేక మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడలలో రాణించాలంటే క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి  పదో తేదీ వరకు చిత్తూరు జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని అధిక సంఖ్యలో పథకాలు తీసుకురావాలని టీజీ ఆకాంక్షించారు. నేటి యువతరం క్రీడాకారులకు మాస్టర్ అథెటిక్స్ క్రీడాకారులు ఎంతో ఆదర్శంగా నిలవడం గర్వకారణం అని టీజీ వెంకటేష్ అన్నారు. అనంతరం పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జివి మోహన్ కుమార్ మాట్లాడుతూ అంకితభావంతో క్రీడాకారులు సాధన చేసి లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం ఆదోని నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు డీజే ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాండురంగా రెడ్డి,జిల్లా కార్యదర్శి రవికుమార్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు,కృష్ణ ప్రసాద్, నరసయ్య, శ్రీనివాసరావు, నౌషాద్,  పాల్గొన్నారు.

About Author