PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి

1 min read

క్రీడాకారుడికి రూ 10 వేలు ఆర్థిక సహాయం

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  క్రీడాకారులు గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు.   మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామ శివారులో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బషీర్ గతేడాది  డిసెంబర్ 24వ తేదిన విశాఖపట్నం లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరుపున రాష్ట్ర స్థాయి  అథ్లైటిక్స్ ఛాంపియన్ పోటిల్లో పాల్గొన్ని 3వ స్థానం లో నిలిచి గోవాలో 9వ తేది జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు  ఎంపికయ్యారు. శనివారం మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఆర్. లక్ష్మయ్య, సర్వేయర్ తీమేష్ క్రీడాకారుడి ప్రతిభను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  దృష్టికి తీసుకుని వెళ్లడంతో రవాణా ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి రూ 10 వేల నగదును అందజేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని కోరుతూ బషీర్ ను అభినందించారు.

About Author