క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్: క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తమకు నచ్చిన క్రీడల్లో సాధన చేసి రాణించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక యునైటెడ్ క్లబ్ నందు టీజివి గ్రూప్, టిజిబి యూత్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్పోర్ట్స్ టైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన ఓపెన్ స్తాయి టైక్వాండో పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూల్ క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ముఖ్యంగా టైక్వాండో,కరాటే, ఇండోర్ గేమ్స్ వంటి క్రీడల్లో సాధన చిన్నారులు చేసుకోవడం కోసం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఆరు కోట్ల నిధులతో ప్రత్యేక హాల్ ను నిర్మించడం జరిగిందన్నారు. క్రమశిక్షణతో పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కర్నూల్ డిస్టిక్ స్పోర్ట్స్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బుల్లెద్దుల రామకృష్ణ, టి.వెంకటేశ్వర్లు,మాజీ ఒలంపిక్ సంఘం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.