కంచి యూనివర్సిటీలో ప్రవేశం కొరకు స్పాట్ అడ్మిషన్స్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: తమిళనాడు రాష్ట్రము కంచి లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయం ( కంచి యూనివర్సిటీ ) వారి స్పాట్ అడ్మిషన్స్ కర్నూలు లోని శంకర మఠం లో నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ శ్రీ గుళ్ళపల్లి శ్రీనివాస యూనివర్సిటీ యొక్క స్థితి గతులు అక్కడి వాతావరణం గురించి వివరించారు. కోర్సుల వివరాలు ఫి హాస్టల్ వసతి గురించి డీన్ వెంకటరమణ తెలియచేసారు.విజ్ఞానం తో పాటు విజ్ఞతను విద్యార్థులలో నింపేదే విద్య ముఖ్య ఉద్దేశం కావాలన్న మహాస్వామి ఆశీపూర్వక సంకల్పాన్ని నడిచేదైవం మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి శత జయంతి ఉత్సవ శుభ సందర్భాన శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి కృషి ఫలంగా ఆవిర్భవించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ విశ్వ మహా విద్యాలయం కాంచీపుర పుణ్య క్షేత్రంలో 1993 నుంచి దిన దిన ప్రవర్ధమానమవుతూ 28 వ స్నాతకోత్సవం ఈ మధ్యనే దిగ్విజయంగా జరుపుకున్నది. కంచి కామకోటి పీఠ పరమాచార్య దివ్య ప్రణాళికను, ప్రస్తుత ఆచార్య దేవులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తన దివ్య సూచనలతో, భవ్యముగా అమలుచేయ బడుతోంది. గత 28 సంవత్సరాలుగా స్నాతకులందరూ తమ తమ భవిష్యత్తును దివ్యంగా మలచుకోవడంలోనే ఈ విశ్వవిద్యాలయ కృషి ఫలితం ద్యోతకం అవుతుంది. ఇంజనీరింగ్ లోని అన్ని విభాగాలు, శాస్త్ర సాంకేతిక, మేనేజ్మెంట్, వైద్య విజ్ఞాన శాస్త్రములే కాక…వైద్య అనుబంధ సేవా శాస్త్రములు (para medicals), Physio therapy, విద్యా శాస్త్ర (Education), న్యాయ శాస్త్ర (Law), ఇతర సాంఘిక సంస్కృతిక భాషా శాస్త్రములు మొదలగు శాస్త్రములను UG, PG మరియు పరిశోధనా (research) స్థాయిలలో అందివ్వ బడుతోంది. బాల బాలికలకు విశ్వ విద్యాలయ ఆవరణలోని సువిశాల వసతి గృహములు రుచికరమైన, ఆరోగ్యకరమైన శుద్ధ శాకాహారంతో అందిస్తాయి. దాదాపు 50 ఎకరాల సువిశాల పచ్చని ప్రశాంత పరిసరాలతో, ప్రతీ విభాగానికి ప్రత్యేక భవనాలతో, అన్ని విభాగాలకూ సంబంధిత ప్రయోగ పరిశోధనా (Labs) విభాగాలతో, PhD పొందిన ఆచార్యుల బోధనలో, 50000 చదరపు అడుగుల సువిశాల AC library తో, WiFi సౌకర్యంతో, 24/7 CC కెమెరాల పర్యవేక్షణ రక్షణ లో విద్యార్థులు దిగ్విజయంగా తమ విద్యార్జనను ఆమోఘంగా పొందవచ్చని చాలా మంది ఔత్సాహికులకు తెలియదు. అనేక మేనేజ్మెంట్ క్లబ్బులు, incubator సర్కిల్స్, startup testing క్లబ్బులు, విద్యార్థి వికాసానికి తోడ్పాటు సాంస్కృతిక క్లబ్బులు అందుబాటులో ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు.అందు నిమిత్తమై…విశ్వ విద్యాలయ అనేక ప్రదేశాలలో స్పాట్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిభావంతులకు అనేక ప్రోత్సాహక స్కాలర్షిప్ కూడా అందిస్తుంది. విశ్వవిద్యాలయం ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు… కంచి కామకోటి పీఠ అంగములైన శాస్త్రసరణి మరియు సంప్రదాయ పాఠశాలలు తమ తమ వసతి గృహముల ద్వారా ఇతర ప్రోత్సాహక స్కాలర్షిప్ లు కూడా అందిస్తున్నాయి. ఈ సదవకాశాన్ని ఔత్సాహికులందరూ అంది పుచ్చుకొని లాభపడి…మన భారతావనికి మంచి భవిష్యత్తును అందించడంలో నిష్ణాతులు కాగలరని ఆశిస్తున్నాము.ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర నాయకులు హెచ్ కే రాజశేఖర రావు, కల్లె చంద్రశేఖర్ శర్మ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.