PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నకిలీ విత్తనాల విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి

1 min read

– చిరు ధాన్యాల సాగు పెంపు కు చర్యలు తీసుకోవాలి
– ఈ కెవైసి మరియు ఈ క్రాప్ బుకింగ్ 100 శాతం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి
– జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు మొక్కుబడిగా జరుగకూడదు
– జిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా విక్రయాలు చేస్తున్న షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసన సభ్యులు సుధాకర్, జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయాల పై చర్చ సందర్భంగా నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.. మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాలలో రైతులు జిప్సం తదితర సూక్ష్మ పోషకాలు, నీమ్ ఆయిల్ కోరుతున్న సందర్భంగా ఎంత మంది రైతులకు అవసరం ఉందో తెలుసుకుని వాటిని తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ రాజు ను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఈ కెవైసి, ఈ క్రాప్ బుకింగ్ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.. బయట ఉన్న రైతులను రైతు భరోసా కేంద్రాల వద్దకు రప్పించి పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు… వైఎస్సార్ యంత్ర సేవ పథకంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు సిహెచ్ సి గ్రూపులకు యంత్రాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో భాగంగా జొన్న, సజ్జ, కొర్ర, రాగులను రైతులు ఎక్కువ పండించే విధంగా మోటివేట్ చేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి నిఆదేశించారు. చిరుధాన్యాలను ప్రోత్సహించడంలో భాగంగా కలెక్టరేట్ లో మిల్లెట్ కేఫ్ ఏర్పాటుకు కలెక్టర్ అంగీకరించారు… రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఏ అధికారి వద్ద కూడా ఫైల్ పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పిల్లలు చాలా బాగా చదువుకున్నారని, వారి ద్వారా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల జరిగే నష్టాల గురించి రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించే విధంగా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కి సూచించారు.. అదే విధంగా పొలం బడి, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో కూడా ఈ అంశం గురించి చర్చించాలని కలెక్టర్ సూచించారు. మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాలకు, పొలం బడులలో ప్రజా ప్రతినిధులు,రైతులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు మొక్కుబడిగా జరుగకూడదని, ఆర్థికేతర సమస్యలకు ఈ సమావేశాల్లో పరిష్కారం చూపే విధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్ని ఔట్లెట్స్ సిద్ధం చేశారని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని ప్రశ్నించారు.. 129 మినీ ఫిషరీస్ ఔట్లెట్ కి గాను 30 రన్నింగ్ లో ఉన్నాయని, మిగిలిన వాటికి లబ్ధిదారులను గుర్తిస్తున్నామని ఆమె తెలిపారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని ఆదేశించారు.పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, ఇలాంటి కంపెనీలు విత్తనాలు అమ్మకుండా ఎందుకు బ్యాన్ చేయకూడదు అని ప్రశ్నించారు..ఈ అంశం కమిషనరేట్ పరిధిలో ఉందని డి ఏ వో వివరించారు. గ్రామాల్లో రైతులు అందరూ ఈ క్రాప్ నమోదు చేసే విధంగా సచివాలయ పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ లు అవగాహన కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. . భారీ వర్షాల వల్ల నష్టపోయిన మామిడి పంటకు నష్టపరిహారం చెల్లించే అవకాశాన్ని పరిశీలించాలని ఉద్యాన శాఖ అధికారికి సూచించారు..పండ్లను కార్బైడ్ వంటి రసాయనాలతో మాగబెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, అలా జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హర్టికల్చర్ అధికారిని కోరారు. ఫర్టిలైజర్స్ వాడకుండా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సూచించారు.కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ మాట్లాడుతూ శనగల సేకరణ లో భాగంగా గోడౌన్ వద్దకు వెళ్లిన తర్వాత నాణ్యంగా లేవని వెనక్కు పంపడం వల్ల రైతులు నష్టపోతున్నారని, పొలాల దగ్గరనే చెక్ చేసి రైతులకు చెప్పాలని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ కు సూచించారు..ఎదురూరు గ్రామంలో కొంత మంది రైతులకు విద్యుత్తు సమస్యలు ఉన్నాయని ఆ సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీడీసీఎల్ డి ఈ ని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లడుతూ పొలంబడి కి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నారా లేదా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఫర్టిలైజర్స్ వాడకం తగ్గించి నాచురల్ ఫార్మింగ్ చేసే విధంగా వారిని మోటివేట్ చేయాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ప్రభాకర్ రెడ్డి , వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author