PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఎస్​ఆర్​’ క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే ఉద్యమమే..!

1 min read

– కర్నూలు ఫోటో,వీడియో అండ్​ అల్లాయిడ్​ సర్వీసెస్​ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి
పల్లెవెలుగువెబ్​, కర్నూలు: వివాహ వేడుకలలో ఫోటోలు తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్​ను అనంతపురం నగరంలోని ఎస్​ఆర్​ కళ్యాణ మండపం యాజమాన్యం ఘోరంగా అవమానించిందని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు కర్నూలు ఫోటో,వీడీయో అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి. కర్నూలు రాజ్​ విహార్​ సర్కిల్​ నుంచి కలెక్టరేట్​ వరకు నగరంలోని ఫోటో, వీడియో గ్రాఫర్​ అండ్​ అల్లాయిడ్​ సర్వీసెస్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… వీ.ఐ.పీ.వాళ్ళు వెళ్ళే లిఫ్ట్ లో ఎవ్వరూ లేని సమయంలో వెళ్ళిపోతున్న ఫోటోగ్రాఫర్ బాష ను.. ‘ నువ్వు లేబర్​వి.. లేబర్లు వెళ్లే లిఫ్ట్​లో వెళ్లాలని అక్కడి రిసెప్షన్​ చెప్పడంతో….మేడం నేను లేబర్​ను కాదు… ఫోటో గ్రాఫర్​ను.. స్టూడియో ఓనర్​ను అని తెలిపినా… నానా దుర్బాషలాడి అవమానించడం దారుణమన్నారు. వెంటనే ఎస్​ఆర్​ కళ్యాణమండపం యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆ తరువాత సీనియర్ ఫోటోగ్రాఫర్ భానుప్రకాష్ మాట్లాడుతూ యస్.ఆర్.గ్రాండ్ యాజమాన్యం దిగి రాకపోతే ఛలో అనంతపూర్ పేరుతో ఉద్యమాన్నిఉధృతం చేసి రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చి సదరు కళ్యాణమండపం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీరప్పా, శ్రీకాంత్,ప్రవీణ్,బాషా,గోవిందు,హరి,భాస్కర్,అనిల్,నాయుడు వందమంది ఫోటో ,వీడియో ,సంబంధిత శాఖల కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author