NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశారదా మాత కుట్టు శిక్షణా కేంద్రానికి అండగా ఉంటాం :  రామారావు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: విశ్వహిందూ పరిషత్ – మాతృ మండలి ఆధ్వర్యంలో కర్నూలు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖంఢలోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయ కళ్యాణ మండపం,శరీన్ నగర్ లో గత సంవత్సరం కృష్ణాష్టమి రోజున ప్రారంభించిన శ్రీ శారదామాత ఉచిత కుట్టు శిక్షణ కేంద్రానికి ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు భగవాన్ బాలసాయి ట్రస్టు చైర్మన్​, విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ట్రస్టీ రామారావు. కుట్టు శిక్షణ కేంద్రం నిర్వాహకులు ఆదివారం బాలసాయి బాబా ట్రస్ట్​ చైర్మన్​, వీహెచ్​పీ కేంద్రీయ ట్రస్టీ రామారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  కుట్టు శిక్షణ కేంద్రం ఇంచార్జ్ భార్గవి మాట్లాడుతూ ఈనెల 14 వ తేదీన భగవాన్ బాల సాయి జయంతి సందర్భంగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రానికి భగవాన్ బాల సాయి సేవా ట్రస్ట్ చైర్మన్ రామారావు  దాతృత్వంతో 8 కుట్టు మిషను ఉచితంగా ఇచ్చారని, 28న కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించామని చెప్పేందుకు సంతోషిస్తున్నామన్నారు. 

అనంతరం రామారావు మాట్లాడుతూ పేదలు, మహిళలు ఆర్థిక స్వాలంబనతో ఎదగాలని, కష్టపడేవారికి బాలసాయిబాబా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు.  అనంతరం కేంద్రం నిర్వాహకులు రామారావును శాలువాకప్పి,భగవద్గీత గ్రంథాన్ని అందించారు.  కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ విభాగ్ సేవా కన్వీనర్ గురుమూర్తి, బజరంగ్దళ్ కన్వీనర్ నీలి నరసింహ,జిల్లా సత్సంఘ కన్వీనర్ మాళిగి భానుప్రకాష్,కర్నూలు నగర మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి,ప్రఖంఢ కన్వీనర్ విజయలక్ష్మి శిక్షణా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.

About Author