PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట

1 min read

–యాగంటి పల్లె గ్రామ సర్పంచ్ బండి వరలక్ష్మి,గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి పూల మాలలతో ఘన స్వాగతం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం యాగంటి పల్లె గ్రామంలో టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట దేవాలయాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ బండి వరలక్ష్మి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పూలమాలలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారిని ఘన స్వాగతం పలికి ఆలయం వరకు ర్యాలీతో రావడం జరిగింది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి మండల వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి గారికి సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులు లాయర్ మాధవ రెడ్డి గారికి యాగంటి ఆలయ మాజీ చైర్మన్ దొనపాటి యాగంటి రెడ్డి గారికి సర్పంచ్ బండి వరలక్ష్మి గారికి వ్యాపారవేత్త నాగిరెడ్డి గారికి శాలువాలు కప్పి ఘనంగా పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో సమరాసత ఫౌండేషన్ వారి సహకారంతో టిటిడి శ్రీవాణి ట్రస్ట్ వారి 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో గ్రామ ఎస్సీ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగిందని కేవలం ఆరు నెలల కాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎస్సీ సోదరులంతా కలిసికట్టుగా ఈ గుడి నిర్మాణం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఎస్సీ సోదరులు అంతా కలిసికట్టుగా ఉండి ఈ ఆలయంలో ప్రతి రోజూ ధూప దీప నైవేద్యములు జరుపుకోవాలని అలాగే అలాగే ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎస్సీ సోదరులలో ఎవరైనా బాగా చదువుకునే వారు ఉంటే తిరుమల తిరుపతి స్వామి దేవస్థానం వారు వారికి పది,పదిహేను రోజులపాటు శిక్షణ ఇచ్చి పూజా కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఎంతో సుందరంగా నిర్మించుకున్న ఈ ఆలయాన్ని తమ సొంత ఇంటివలె పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి రోజు పూజా కార్యక్రమాలతో భక్తులు దేవుని కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాగంటి పల్లె గ్రామ సర్పంచ్ బండి వరలక్ష్మి, ఎంపీటీసీ మారం లక్ష్మీదేవి, యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్ దోనపాటి యాగంటి రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు బండి బ్రహ్మానందరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, కళాధర్ రెడ్డి, యామ పుల్లారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, శివరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, యామ సుధాకర్ రెడ్డి, బోయ వెంకట రాముడు మారం ఈశ్వరయ్య, బుచ్చి వెంకటయ్య, నారాయణదాసు, సమర సతసేవ ఫౌండేషన్ రాయలసీమ ధర్మ ప్రచార ఈశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా కన్వీనర్ మాధవరెడ్డి, జిల్లా దేవాలయ కమిటీ మెంబర్ నాగ మల్లారెడ్డి, జిల్లా సహా కన్వీనర్ నాగ మోహన్ రెడ్డి, జిల్లా ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు, సబ్ డివిజన్ ధర్మ ప్రచార బాల ఈశ్వర్ రెడ్డి, బనగానపల్లె కన్వీనర్ శంకరయ్య, యాగంటి పల్లె గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులుపాల్గొన్నారు.

About Author