కొసిగిలో శ్రీ భీరప్ప స్వామి దేవర…
1 min read
కొసిగిలో శ్రీ భీరప్ప స్వామి దేవరలో పాల్గొన్న కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న .
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని శ్రీ భీరప్ప స్వామి దేవర పూజారి మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు బిఎన్ టాకీస్ వేంకటేష్ శివరాం నర్సింహులు గోవిందప్ప చిన్న మహదేవ రమేష్ పూజారి మూకప్ప భీర మల్లయ్య మల్లికార్జున అది ఉప్పరహల్ మాజీ సర్పంచ్ ఈరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ఆంధ్రప్రదేశ్ కు ఏడు దేవాలయాలు పల్లకిలు కోసిగి జడేమల్లయ్యస్వామి ఉప్పలంకరిలింగప్పస్వామి కుంభలూరు జడేమల్లయ్యస్వామి పర్వతాపురం అయ్యాలప్పస్వామి కుప్పగల్లు కోనిగిరప్పస్వామి మణేకుర్తి అయ్యాలప్ప స్వామి గట్టుబిచ్చాల కునసెప్ప స్వామి కోసిగిగ్రామంలో ఊరేగింపుగా పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో డోళ్లులతో సాంప్రదాయాలతో స్వాగతం పలికి పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవరలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో భక్తులు కురువ కులస్థులు అధికసంఖ్యలో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున భోజన వసతి కల్పించారు.