NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

JEE MAINS లో ’శ్రీ చైతన్య’ విద్యార్థుల విజయకేతనం..

1 min read

అభినందించిన కళాశాల యాజమాన్యం

పల్లెవెలుగు, కర్నూలు: జె.యి.యి. మెయిన్స్ 2024 జనవరి మొదటి సెషన్ ఫలితాలలో కర్నూలు శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి ప్రప్రథమంగా 100 కి 100 పర్సెంటైల్స్తో కొత్త ఒరవడిని సృష్టించారని తెలియ చేయడానికి సంతోషిస్తున్నట్లు శ్రీ చైతన్య కళాశాలల ఎ.జి.ఎమ్. శ్రీ మురళీకృష్ణ, డీన్ సరళ  మరియు డీన్ బాలాజీ విద్యార్థుల అభినందన సభలో తెలియజేశారు. తమ విద్యార్థి పి. ప్రణీత్ రెడ్డి ఫిజిక్స్ విభాగంలో 100 కి 100 పర్సెంటైల్ తో అసాధారణ ప్రతిభ కనబరిచాడు మరియు 300 మార్కులకు 250 మార్కుల తో 99.77 పర్సెంటైల్, పి.ఉమా లికేశ్ 98.75 పర్సెంటైల్, 2.36 65 98.65 25, 4.5 97.58 25 లాంటి అనేక ఉత్తమ పర్సెంటైల్స్ సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు కేవలం కర్నూలు శ్రీ చైతన్య నుండి మాత్రమేనని వేరొక ప్రాంత ఫలితాలు కావని ఎ.జి.ఎమ్.మురళీకృష్ణ తెలియచేశారు. కళాశాలలో జరిగిన అభినందన సభలో ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ రాబోయే జెయియి మెయిన్స్ ఫేజ్ 2 లో మిక్కిలి మెరుగైన ప్రతిభను అనేక మంది విద్యార్థులు సాధించ గలరని, సాధించగలగటానికి కావలసిన తర్ఫీదును విద్యార్థులకు అందజేస్తున్నామని ఇదే విధమైన విజయపరంపరను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

About Author