‘క్యాట్’ ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విజయకేతనం
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి : రాయచోటి పట్టణంలోని యన్. జి.వో.కాలనిలో ఉన్నట్టు వంటి శ్రీ చైతన్య విద్యార్థులు మార్చి28న 2021వ సంవత్సరం జరిగిన క్యాట్ రెండవ దశ పరీక్ష యందు27మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల రీజనల్ ఇన్ ఛార్జ్ మహబూబ్ భాష తెలిపారు. శ్రీ చైతన్య టెక్నో కరిక్యులమ్ విద్యార్థి ఎదుగుదలకు ఎంతోగానో ఉపయోగపడుతుందని శ్రీ చైతన్య ఎ.జి.మ్.రమణ య్య తెలిపారు. ఈ పరీక్ష లోచిల్లూరి రూపశ్రీ అనువిద్యార్థి ఉన్నత ప్రతిభ కనబరిచి మూడు గోల్డ్ మెడల్స్, నగదు బహుమతి మరియు సర్టిఫికేట్ ను సాధించినట్లు తెలిపారు. చిల్లూరిరూపశ్రీ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. చిల్లూరిరూపశ్రీ లోని పట్టుదల ను గుర్తించి పరీక్ష వ్రాయించామని చిల్లూరి రూపశ్రీ ఉత్తమ స్థానానికి ఎదగాలని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.విజేత విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలోపాఠశాల ప్రిన్సిపాల్ బషీర్అహ్మద్ ,డీన్ .నాగనరేంద్ర, సీ బ్యాచ్ ఇన్ ఛార్జ్ వెంకట్రాజు.తల్లి దండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.