శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయం…కార్తీక శోభాయమానం..
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: కర్నూలు జిల్లా గడివేముల మండల కేంద్రంలోని శ్రీ దుర్గా భోగేశ్వరం స్వామి దేవాలయం.. కార్తీక శోభతో వెల్లివిరిసింది. కార్తీకమాస మూడవ సోమవారం సందర్భంగా భక్తులు వేలాదిగా స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు అర్చనలో పాల్గొన్నారు. ఆర్య వైశ్య సత్రం నందు, జంగం నాగమల్లయ్య సత్రం నందు మరియు కొత్తూరు పూజారి నారాయణస్వామి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చైర్మన్ ఆర్ గోపాలయ్య , కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి మరియు ధర్మకర్తలు చింతల వెంకటరమణ యాదవ్ నాగేశ్వర్ రెడ్డి మరియు పుల్లారెడ్డి నరసింహుడు ప్రసాద్ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎస్సై శ్రీధర్ దంపతులు , పాణ్యం సిఐ జీవన్ గంగ నాథ్ బాబు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబరు హుసేన్ బాష, గడిగరేవుల ఉప సర్పంచ్ గోదా ప్రసాద్ పాల్గొన్నారు. గడివేముల ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.