PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నూరులో శ్రీ హనుమ యజ్ఞ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  మండల కేంద్రమైన చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ హనుమయజ్ఞ జయంతి నిర్వహించేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఐదు గంటలకు సుప్రభాత సేవ. ఐదు గంటల 30 నిమిషాలకు మూలవిరాట్ విగ్రహానికి అభిషేక పూజలు అలంకరణ వేద పండితులచే నిర్వహించనున్నారు.8 గంటల నుంచి భక్తుల కోసం సర్వ దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని సందర్శించే భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి కోలాటం బృందం వారిచే నిర్వహిస్తున్నారు.

About Author