శ్రీలంక అమ్మాయి.. ఆంధ్ర అబ్బాయి ఒక్కటయ్యారు !
1 min readపల్లెవెలుగువెబ్ : శ‌్రీలంక అమ్మాయి. ఆంధ్రా అబ్బాయి. జపాన్ లో మనసులు కలిశాయి. ఇండియాలో మనువు కుదిరింది. అబ్బాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తరపు కూడ పెళ్లి ఇష్టమే కానీ.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కన్నకూతురి పెళ్లి శుభకార్యానికి కూడ నోచుకోకుండా చేసింది. తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం బాలిరెడ్డిపాళెంలోని శ్రీపట్టాభిరామాలయం వేదికైంది. బంధువుల సమక్షంలో ఆదివారం హిందూ సంప్రదాయబద్ధంగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. కోట మండలం విద్యానగర్‌కు చెందిన ఆసం నాగార్జున జపాన్‌లోని ఓ కంపెనీలో స్టాఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. శ్రీలంక కొలంబియాలోని కలుతర పట్టణానికి చెందిన లక్ష్మీప్రియమళి ఉన్నత చదువుల కోసం జపాన్‌కు వెళ్లారు. చదువు పూర్తికాగానే నాగార్జున పనిచేసే కంపెనీలోనే జాబ్‌లో చేరారు. ఇరువురి పరిచయం కొద్దిరోజులకే ప్రేమగా మారింది. వరుడు నాగార్జున తన కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారంగా బంధుమిత్రుల సమక్షంలో బాలిరెడ్డిపాళెంలో పెళ్లి చేసుకున్నాడు.