శ్రీ నీలకంఠేశ్వర స్వామి ప్రభు పాహిమాం పాహిమాం పాహిమాం
1 min read
ప్రతి భక్తుడు చేత పంచామృత అభిషేకం వీటి కోసం బారులు తీరిన భక్తులు
శివనామ స్వరంతో మారుమోగిన నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించిన దేవాలయ కుర్నీ నేసే సంఘం కమిటీ సంఘం సభ్యులు
ప్యాపిలి న్యూస్ నేడు : మహాశివరాత్రి పర్వదిన పండుగ పురస్కరించుకొని బుధవారం ప్యాపిలి పట్టణంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయానికి మామిడి ఆకుల తోరణాలు,తాటి,కినిగ అకులతో పందిరిళ్లు, పూలమాలలతో,విద్యుత్ దీపాలతో దేవాలయంలో అలంకరించారు.బుధవారం వేకువ జామున నుండి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి అభిషేకాలు ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శివనామ స్వరాలు మార్మోగాయి దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయ కమిటీ సంఘం కుర్నీ నేసే సంఘం వారు భక్తులకు పంచామృతాలు ఇచ్చి నీలకంఠేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. అంతకమునకు మొదటగా వినాయకుని పూజ, ధ్వజారోహణం,నవగ్రహ పూజ,కలశపూజ, ఆలయ పురోహితులు ఎం. నాగ మల్లయ్య భక్తులకు ప్రత్యేక పూజలు మహా మంగళ హారతులు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిని పురస్కరించుకొని దేవాలయంలో భక్తులకు పంచామృతాలు పంచి నీలకంఠేశ్వర స్వామికి అభిషేకం చేయడం ఆనవాదిగా నిలచింది, నీటి కోసం ప్యాపిలి పట్టణంలో ని భక్తులు బారులు తీరి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారు మొక్కలు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ దేవాలయంలో దేవునికి పంచామృతం అభిషేకం నిర్వహించిన కుర్నీ నేసే సంఘం కమిటీ సభ్యులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.