పేదింటపెద్ద కొడుకులా శ్రీ నృసింహ సేవావాహిని సేవలు
1 min read– సేవల్లో తరిస్తున్న కలియుగ మహర్షి ఈ సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఆపద అన్నా నేనున్నా నంటూ ముందుకొచ్చి ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపుతున్న స్వచ్చంద సంస్థ శ్రీ నృసింహ సేవావాహిని,5 వసంతాలు పూర్తి చేసుకొని 6 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలపై ప్రత్యేక కథనం….శ్రీ నృసింహ సేవా వాహిని అనే స్వచ్చంద సంస్థ ను 2017 లో డా. కృష్ణ చైతన్య స్వామి ప్రారంభించారు. నాటి నుండి ఒకవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరోవైపు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి ఆపద వేలల్లో అన్నగా,కష్టాల కడలిలో కన్న తల్లిగా, బాధల్లో బంధువుగా, భాద్యతనెరిగిన కొడుకు గా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవలను అందిస్తూ, ఎందరికో మార్గదర్శనంగా ఉన్నది శ్రీ నృసింహ సేవావాహిని,
రామానుజ సిద్ధాంతమే ఆదర్శం.. అందరూ సమానమే భగవంతుడు దృష్టిలో బేదాభిప్రాయాలు ఉండవని అందుకే శ్రీ నృసింహ సేవా వాహిని కులానికి ప్రాధాన్యత ఇవ్వదని, కులం కన్నా గుణం ముఖ్యమని తలచి తమ గురుదేవులు శ్రీ భగవద్ రామానుజుల సిద్ధాంతాన్ని లోకo లో నింపాలని తలచి దళిత పూజారిని బుజాలపై ఎత్తుకొని వెళ్లి రంగనాధ దర్శనం చేపించిన అపర భక్తుడు ఈ గురు పుంగవుడు. ఆపత్కాలంలో ఉన్న ఎంతో మంది పేదలను చేరదీసి వారికి సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి.
ఆలయాలకు దూప దీప నైవేద్యాలు అందజేత…గ్రామాలలో ఎన్నో ఆలయాలు దూపదీప నైవేద్యాలకు నోచుకోక ముసివేస్తున్నారని తెలిసి నృసింహ భక్తకుటుంబం ఆధ్వర్యంలో కొన్ని వందల ఆలయాలకు దూపదీప నైవేద్య సామాన్లు అందించి అర్చకులను అందరించి ధర్మపరిరక్షణ చేస్తున్నది శ్రీ నృసింహ సేవా వాహిని,
ఆలయాలు పునరుద్దరణ …కొన్ని సంవత్సరాలనుండి మూసివేసిన ఆలయాలను శుభ్రం చేసి ప్రతి నిత్యం పూజలు జరిగేలా కమిటీలు ఏర్పాటు చేసి దైవం పట్ల విశ్వాసాన్ని నింపుతూ సత్సంగాలు నిర్వహిస్తూ ఎంతో మందిని ఘర్వాపసి ద్వారా తిరిగి వారి ధర్మం లో కొనసాగేలా ప్రయత్నం చేస్తున్నది శ్రీ నృసింహ సేవా వాహిని.
కరోనా కష్టకాలంలో కన్న తల్లిలా సేవలు చేసిన నృసింహ సేవా వాహిని కరోనా కష్ట కాలంలో ప్రతి రోజు కొన్ని వందల మందికి అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది.కరోనా భయానికి యాచకులని ఎవరు దరి చేరనివ్వడం లేదని తెలిసి వంట చేసి వారి దగ్గరికి వెళ్లి పంచి ఇచ్చి అమ్మ లా అక్కున చేర్చుకున్నది. వలస కూలీలకు ఎంతో మందికి అర్థరాత్రులు సైతం లెక్క చేయక అన్న ప్రసాదాన్ని వండి వడ్డించిన అమృత వల్లి శ్రీ నృసింహ సేవా వాహిని.
రైతు లకు అండగా…రైతు దేశానికి వెన్నెముక అనే మాటలకే పరిమితమైన ఈ రోజుల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఏరువాక పౌర్ణమిని రైతుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేస్తూ విజయ మాలతో వారిని సత్కరిస్తూ కష్టాల కడలిలో ఉన్నప్పుడు మేమున్నామంటూ భరోసా ఇస్తూ ఎంతో మందిని ఆదుకుంటూ ఉన్నది శ్రీ నృసింహ సేవా వాహిని.
ఈ సంవత్సరం ఒకేసారి 1008 మందితో సహస్రాధిక రైతు పూజోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగినది. అందుకుగాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నది శ్రీ నరసింహ సేవా వాహిని.వరదల సమయం లో పడవల ద్వారా అన్న ప్రసాదం పంపిణీ ఈ సంవత్సరం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన కొన్ని వందల కుటుంబాలకు ప్రతిరోజు అన్న ప్రసాదాన్ని అందించి ఆదుకున్నది శ్రీ నృసింహ సేవా వాహిని. చింతూరు కూనవరం విఆర్ పురం మండలాలలో ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిదిపోగా పడవల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్నప్రసాదాన్ని వండి వడ్డించినటువంటి ఆపద్బాంధవుడు శ్రీ నృసింహ సేవా వాహిని.
నిండు గోదావరిలో వజ్రోత్సవ వేడుకలు ..వరదల కారణంగా కనీసం నిలువ నీడ లేక అల్లాడుతున్న ఎన్నో గ్రామాలలో గ్రామస్తుల కోరిక మేరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించిందిశ్రీ నృసింహ సేవా వాహిని. పడవలన్నింటిని ఒక దగ్గరకు చేర్చి దేశ సమైక్యతను లోకానికి చాటాలని జండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించినదిశ్రీ నృసింహ సేవా వాహిని. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఎవరో కాదు ఒక సాధారణ పురోహితుడు. అతడే డా.కృష్ణ చైతన్య స్వామి.డా. కృష్ణ చైతన్య స్వామి,* సమాజంలో జరుగుతున్న ఎన్నో అసమానతలు చూసి చలించి తీసుకున్న నిర్ణయానికి పునాదే ఈ నృసింహ సేవా వాహిని అనే స్వచ్ఛంద సంస్థ. అహోబిల మఠంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రధాన అర్చకులుగా ఉంటూ, రామానుజుల వారి సిద్ధాంతాన్ని మరియు అందరూ సమానమే అన్న సమతా మూర్తి భావాన్ని లోకానికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం ఈ సంస్థ స్థాపనకు పునాదులు వేసింది. అతడే ఒక సైన్యంగా ఎంతో మంది భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని సమస్య అని తెలియగానే స్పందించే తత్వంతో అడుగులు ముందుకు వేస్తూ, ఎంతోమంది భక్తుల సహాయ సహకారాలతో సంస్థ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్న యువ కిరణం డా. కృష్ణ చైతన్య స్వామి. ఎవరిని ఏమీ ఆశించకుండా ఎవరు పిలిచినా కాదనకుండా పూజాది కార్యక్రమాలు చేస్తూ దైవం పట్ల వారిలో విశ్వాసాన్ని నింపుతూ, రాత్రింబవళ్లు లెక్క చేయక సమాజ సేవే పరమావధిగా అస్తమించని సూర్యుడులా ప్రతి నిత్యం లోక క్షేమం కొరకు పాటు పడుతున్న మరో రామానుజులు డా. కృష్ణ చైతన్య స్వామి. ఇంతటి యోగి కి మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే భాగ్యం భగవంతుడు ప్రసాధించాలని వేడుకుందాం మనం కూడా సహకారం అందిద్దాం.