NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర

1 min read

– అశేషంగా పాల్గొన్న భక్తజనం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా శ్రీ నూకాలమ్మ అమ్మవారి గంధ అమావాస్య సందర్భంగా గురువారం జాతరకు స్థానిక కొత్తపేటలో భక్తులందరూ వచ్చి పసుపు ,కుంకుమ ,గాజులు, సెలవు ఉపారం ,పానకాలు సమర్పించు కొన్నారు. కేరళ డప్పు వాయిద్యం మంగళ సన్నాయి, పోతురాజు బాబు వేషధారణ నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి నామస్మరణతో ప్రాంగణమంతా మారు మోగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మంత్రవాది రామకృష్ణ యోగానంద శర్మ, ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగం సన్యాసిరావు,ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నక్క నాగేశ్వరావు, డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి కనక రాజేశ్వరి కృష్ణ, పొలిమేర దాసు, 43 డివిజన్ అధ్యక్షులు వెల్లంకి రాజు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సాడి నూకరాజు సన్స్, ఉత్సవ కమిటీ సభ్యులు గొంతిన రామకృష్ణ ,గొంతిన సర్వేశ్వరరావు, మాజీ చైర్మన్ కరణం రాజు, జంప సూర్యనారాయణ ,ఉల్లింగుల సురేష్ ,ప్రసాద్ ,భావిశెట్టి కేశవ, సంపంగి కిరణ్ అశేష భక్తజనం పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా నిర్వాహకులు పరివేక్షించారు.

About Author