PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 10 నుంచి… శ్రీ రాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలు ప్రారంభం

1 min read

12 న పూర్వరాదన, 13 న మధ్యారాధన, 14 ఉత్తరాధన (మహారథోత్సవం)

పలు అభివృద్ధి పనులు ప్రారంభం

శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు

పల్లెవెలుగు వెబ్​, మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 351 వ ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు అన్నారు. సోమవారం శ్రీ మఠం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామి జీ మాట్లాడుతూ ఈ నెల 10 నుండి 16 వరకు ఆరాధనోత్సవాలు జరుపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 10 న ద్వజరహణ తో ప్రారంభం అవుతాయని తెలిపారు. 11 న శాకోత్సవం, రజత మండపోత్సవం, 12 పూర్వరాదన, 13 న మద్యరాధన, 14 న ఉత్తరాధన మహారథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యరాధన రోజున సాంప్రదాయ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ వల్ల ఆరాధనోత్సవాలు జరపలేకపోయామని అన్నారు. రాఘవేంద్రస్వామి ఆశ్శీసులతో ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆరాధనోత్సవాల్లో పాల్గొనే భక్తులు స్నానాలు చేసేందుకు తుంగభద్ర నది ఒడ్డున శవర్లు, దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పలు అభివృద్ధి పనులు ప్రారంభం : రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని పలు అభివృద్ధి పనులు ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. ఆరాధనోత్సవాలకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే వాహనాలను నిలుపేందుకు హెలికాప్టర్ గ్రౌండ్, సంస్కృత విద్యాపీఠం వెనుక భాగంలో, సంత మార్కెట్ లో, నది ఒడ్డున పంచముఖి దర్సన్ వసతి గృహం ముందు బాగంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఏఓ మాధవశెట్టి, మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు, వెంకటేష్ జోషి, బిందు మాధవ, ప్రకాష్, కరణం శ్రీ నిధి, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

About Author