పదవ తరగతి ఫలితాల్లో శ్రీ రాజరాజేశ్వరి పాఠశాల ప్రభంజనం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మల్లె వెంకటాద్రి 588 సాధించి మండల టాపరుగా నిలిచారు. గడివేముల మండలం పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి, కేజీబీవీ పాఠశాలలో 40 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, జడ్పీహెచ్ఎస్ గడిగరేవుల పాఠశాల విద్యార్థులు 62 మంది పరీక్ష రాయగా 31 మంది విద్యార్థులు పాసయ్యారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గని విద్యార్థులు 72 మంది పరీక్ష రాయగా 33 మంది విద్యార్థులు పాసయ్యారు. ఏపీ మోడల్ స్కూల్ లో 89 మంది విద్యార్థులు పరీక్ష రాయడం 48 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరిమిద్దల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 41 మంది విద్యార్థులు పరీక్ష రాయగా తొమ్మిది మంది పాసయ్యారు. గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 83 మంది పరీక్ష రాయగా 40 మంది పాసయ్యారు. శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో 70 మంది విద్యార్థులు రాయగా 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు సెయింట్ పాల్ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు గాను 13 మంది పాసయ్యారు, దుర్వేసి పాఠశాలలో 25 మంది విద్యార్థులకు గాను 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదవ తరగతి పరీక్షల పాసైన విద్యార్థులకు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు అభినందించారు. ఈసారి ప్రవేట్ పాఠశాలలో 92 ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో 50% ఆపై మించకపోవడం కొసమెరుపు.