ఉలిందకొండలో శతాబ్ది ఉత్సవాలలో కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీరాముడు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఉలిందకొండ గ్రామంలో శ్రీ సీతారాముల వారి శతాబ్ది ఉత్సవాలు కల్లె వెంకటాచలమయ్య వంశస్థులు, అయితా నారాయణ శెట్టి వంశస్థులు, ఎర్రం శెట్టి లింగప్ప వంశస్థులు, కదిరి మాణిక్యం రెడ్డి బ్రదర్స్ వంశస్థులు, వడ్డే చిన్న నాగన్న పెద్ద నాగన్న వంశస్థులు, మరియు ఉలిందకొండ గ్రామ ప్రజలు మరియు భక్తులు శ్రీ సీతారామాంజనేయ స్వామివార్లకు పంచామృత అభిషేకము శ్రీరామ, సుదర్శన, నవగ్రహ, రుద్ర హోమములు జరిగినవి. హోమం అనంతరం స్వామివారికి మహా మంగళహారతి (ప్రసాద వితరణ) అన్నదాన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో సుమారుగా వందలాదిమంది భక్తులు పాల్గొని స్వామి వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. రేపు అనగా 6/4/ 2025 (ఆదివారం) ఉదయం గంటలకు7″ గం లకు స్వామివారికి పంచామృత అభిషేకము 9 గంటలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణము 9 గంటలకు మొదలై అభిజిత్ లగ్నంలో కళ్యాణము, సాయంకాలం 6 గంటలకు రథోత్సవము జరుగును. 7/04/2025 (సోమవారం)శ్రీ సీతారాములవారికి ఉదయం 9 గంటలకు పట్టాభిషేకము సాయంకాలం 6 గంటలకు పల్లకిలో గ్రామోత్సవము అత్యంత వైభవంగా జరపడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రతి ఒక్క భక్తులు హిందూ బంధువులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహము పొందగలరని, దూర ప్రాంతాల్లో ఉండే భక్తులు స్వామి వారి యొక్క కళ్యాణాన్ని తిలకించడానికి ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేశామని ఆలయ వంశపారపర్య అర్చకులు కళ్ళే లక్ష్మీనారాయణ శర్మ, వేద పండితులు కళ్ళే ప్రతాప్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లె చంద్రశేఖర్ శర్మ, కళ్ళే జైపాల్ శర్మ, కళ్ళే శ్రీధర్ శర్మ, అయితా రామకృష్ణ , వడ్డె రామకృష్ణ, వి రమేష్, కదిరి భాస్కర్ రెడ్డి, ఎర్రం శెట్టి తిరుపతి రెడ్డి, వడ్డే నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగినది.
