శ్రీరామకోటి పుస్తకావిష్కరణ చేసిన టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీరామకోటి రాయలన్న ఆలోచన ఎంతో గొప్పదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని ఎండోమెంట్ గోశాలలో ఆవోపా ఆధ్వర్యంలో చేపట్టిన 108 కోట్ల శ్రీరామ నామ లిఖిత యజ్ఞం పుస్తకాన్ని టిజి భరత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన ఈ రోజుల్లో శ్రీరామ కోటి రాయాలన్న ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం గొప్ప కార్యక్రమం అన్నారు. హిందువులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరామాలయ నిర్మాణం ఈ తరంలో పూర్తి కావడం మనం చేసుకున్న అదృష్టం అన్నారు. ఇక శ్రీరామకోటి కోటి సార్లు రాసిన వారిని గుర్తించి సత్కరించాలన్నారు. అప్పుడే శ్రీరామకోటి విలువ ఇప్పటి తరానికి తెలుస్తుందన్నారు. చరిత్రను ఎవరూ మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, లలిత పీఠం సుబ్బు స్వామి, భజరంగ్ దళ్ ప్రతాప రెడ్డి, అవోపా యుగంధర్, సురేష్, జగదీష్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.