శ్రీ రామకృష్ణుని బోధనలు నిత్య చైతన్య దీపికలు
1 min read– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి.. కార్యనిర్వాహకులు, తితిదే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీరామకృష్ణ పరమహంస బోధనలు భారత దేశ ప్రజలనే కాకుండా యావత్ ప్రపంచానికి స్పూర్తిదాయకాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. మిడుతూరు మండలం, పైపాళెం గ్రామంలోని శ్రీరామకృష్ణాశ్రమం 31వ వార్షికోత్సవం సందర్భంగా వారు ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ సద్గురు పరిపూర్ణ తాండవ నాగలింగ శివాచార్య స్వాములవారి శివజీవైక్య మఠం పీఠాధిపతులు సద్గురు యల్లప్ప స్వామి మాట్లాడుతూ మౌనస్వామి కారణజన్ములని, వారి తపోశక్తితో ఈ ప్రాంతాన్ని ధార్మిక పరిపుష్టం చేశారన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన లలితా పీఠం పీఠాధిపతులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ భక్తి ఉద్యమంతో ఎందరినో ప్రభావితం చేసి, ఈ జాతి పునర్నిర్మాణం కోసం కృషి చేసిన శ్రీరామకృష్ణ వివేకానందులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కడుమూరు శేషన్న స్వామి, వైద్యం గిడ్డయ్య సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వైద్యం రామానాయుడు, బెల్లరి నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ రామకృష్ణ, గ్రామ పెద్దలు నాగేశ్వర రెడ్డి, రామలింగేశ్వరరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆశ్రమం నిర్వాహకులు ముత్యాల తిరుమలయ్య అతిధులకు సన్మానంతో పాటు భక్తులందరికీ భోజనాలు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.