ఈ నెల 28న శ్రీ రమణ మహర్షి జయంతి ఉత్సవాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : భగవాన్ శ్రీ రమణ మహర్షి 144వ జయంతి ఉత్సవాలు ఈనెల 28వ తేదీ నిర్వహిస్తున్నామని పత్తికొండ అరుణాచల రమణ మహర్షి భక్త బృందం సభ్యులు అడ్వకేట్ చంద్రశేఖర్ నాయుడు, ఉప్పర ఉల్లిగడ్డల నరసింహులు, కాకి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం పక్కన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జయంతి ఉత్సవాల నిర్వహణను వారు పరిశీలించారు. ఈనెల 28వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు భగవాన్ శ్రీ రమణ మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ (అన్నదానం) ఉంటుందని అన్నారు. కావున ప్రజలు శ్రీ రమణ మహర్షి జయంతి సందర్భంగా స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని.వారు కోరారు.