NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరాటేలో శ్రీ శంకరాస్ విద్యార్థి ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   2023  నవంబర్ 25 ,26 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్లలో జరిగిన 16వ నేషనల్ లెవెల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ లో కర్నూల్ లోని శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల విద్యార్థి పి రేవంత్ కుమార్ పాల్గొని కథస్ విభాగంలో బంగారు పతకం,కుమితీ విభాగంలో గ్రాండ్ ఛాంపియన్షిప్ విభాగంలో మొదటి స్థానం సాధించాడు . బంగారు పతకం,గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న పి రేవంత్ కుమార్ ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి .హరికిషన్ ,ప్రిన్సిపల్ శ్రీనివాసులు  విద్యార్థిని అభినందించడం జరిగింది. కళాశాల డైరెక్టర్ హరికిషన్  మాట్లాడుతూ రేవంత్ కుమార్ భవిష్యత్తులో ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో సాధించి కాలేజీకి ,జిల్లాకు,రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్  సుమలత ,ఫిజికల్ డైరెక్టర్ మద్దయ్య పాల్గొని విద్యార్థిని అభినందించారు.

About Author