NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్’ దాతృత్వం

1 min read

– రూ.66 లక్షల విలువైన 200 ఆక్సిజన్ నూతన ఖాళీ సిలిండర్లు అందజేత
– సంస్థ ఎండి ఎన్. విశ్వేశ్వర రెడ్డిని అభినందించిన కలెక్టర్​ సి. హరికిరణ్​
పల్లెవెలుగు వెబ్​, కడప : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా.. జిల్లా యంత్రాంగానికి సహాయ సహకారాలు అందిస్తున్న.. శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వారి దాతృత్వం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. బుధవారం కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న లైఫ్ లైన్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రంలో శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ ఎండి విశ్వేశ్వరర్ రెడ్డి రూ. 66 లక్షల విలువైన 200 ఆక్సిజన్ నూతన ఖాళీ సిలిండర్లను.. జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ రెండవ దశ కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అవసరం అత్యంత అవశ్యకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కొరతను తీరుస్తున్నా.. ప్రజలకు ప్రాణవాయువు అవసరం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో దాతలు ముందుకు వచ్చి చేతనైనంత సహాయం చేయడం ప్రశంసనీయమన్నారు.

About Author