వైభవం… శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం..
1 min read
శ్రీ కాశి రెడ్డి నాయన ఆశ్రమంలో శ్రీరామ నవమి వేడుకలు
- మహోత్సవంలో పాల్గొన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు
అవుకు : నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలోని సీతారామాపురంలో శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని అవుకు మండలం సీతారామపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు శ్రీరామనవమి సందర్భంగా సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, పాణ్యం యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి. అనంతరం సీతారాముల చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఈ సీతారాముల కళ్యాణం మహోత్సవంలో గణపతినాయన మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
