శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పునః ప్రతిష్టా కార్యక్రమాలు
1 min read– మోహన గుప్త సహకారంతో పది లక్షల రూపాయలతో శ్రీ సీతారామ కళ్యాణ మండప నిర్మాణం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తూర్పు వీధి శ్రీరామ మందిరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ గురువారం నుండి 13వ తేదీ సోమవారం వరకు దేవాలయం పున:ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యం రాధా కార్యనిర్వహణ అధికారి మరియు ఆలయ పునః నిర్మాణ దాతల కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆయన వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోయ జై గంగ సత్తిబాబు. డిప్యూటీ మేయర్ గుడిదెసి శ్రీనివాస్, వైసిపి నాయకులు డాక్టర్ దిరిసెల వరప్రసాద్, మున్నులు జాను గురునాథ్, నున్న కిషోర్, మంచెo మైబాబు, పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్ట మహోత్సవం పంచాహ్నక దీక్ష పూర్వకముగా తూర్పుగోదావరి జిల్లా. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ వాస్తవ్యులు వైకాస వైఖానస ఆగమ భాస్కర తేజ “తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండిత” శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయ స్వర్ణ పతాక గ్రహీత” శ్రీమదిత్యాది శ్రీమన్ ఖండవిల్లి వెంకట సూర్య జగన్నాథచార్యులు(రవి) ఆచార్యత్వమున. శ్రీమాన్ వేదానతం రామానుజార్యులు (రాము) ఆచార్యుల వారి పర్యవేక్షణలో దివ్య ప్రతిష్ట దైవ యజ్ఞం చేయుటకు గుగ్గిలం రాము.సత్యవాణి దంపతులు మరియు కనిగొళ్ల దుర్గాచల్లా నాగ రాజేష్.రోజాకుమారి దంపతులు యాజమాన్యంగా నిర్వహించుటకు దైవజ్ఞులచే సుముహూర్తం నిర్ణయమైయ్యిందన్నరు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఐఏఎస్ కమిషనర్ దేవదయ ధర్మసాయ శాఖ గొల్లపూడి, చీఫ్ ఇంజనీర్, సూపరిండెంట్ ఇంజనీర్ (ఎఫ్ఎసి) మరియు సిహెచ్ రంగారావు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారి ఏలూరు, బి ఎల్ నరసింహారావు తనిఖీదారు, ఎన్ ఉదయభాస్కర్ కుమార్ సహాయ ఇంజనీర్, ఎం నాగేశ్వర నెహ్రూ సహాయస్థపతి తదితరులు పాల్గొంటారని. తెలిపారు. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా స్వామివారి ప్రతిష్ట కార్యక్రమమునకు అందరూ ఆహ్వానతులేనని తెలిపారు. తూర్పుది శివయ్య గుడిసందు అభివృద్ధి కమిటీ వారి కోరిక మేరకు. మడుపల్లి మోహన గుప్తా తల్లిదండ్రులు. దివ్యశ్రీ మడుపల్లి కృష్ణమూర్తి, సత్యవతమ్మ జ్ఞాపకార్థం కుమారుడు,కోడలు మడుపల్లి మోహన్ గుప్త , మల్లేశ్వరి చే సుమారు పది లక్షల రూపాయల వేవ్యoతో శ్రీ సీతారామ కళ్యాణ మండపం నిర్మించి నేడు ప్రారంభోత్సవం చేశారు. గుప్త సంస్థ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొని అన్నదానం చేశారు.