PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ శ్రీ చింతామణి గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ట

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు, స్థానిక పత్తేబాద లో శ్రీ వల్లి ప్యాలెస్ (ఉండవల్లి అపార్ట్మెంట్స్ ) ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన శ్రీ శ్రీ శ్రీ చింతామణి గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ట మరియు ఎనిమిదోవ వార్షికోత్స వేడుకలు శుక్రవారం ఆలయం వద్ద అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ గణపతి విగ్రహ ప్రతిష్ట 2015 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ప్రతిష్టించారని నిర్వాహకులు తెలిపారు, నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ వార్షికోత్సవం మరియు పూజా కార్యక్రమాలు అనంతరం భారీ సంఖ్యలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిత ఉండవల్లి రాము, జి రాజేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వార్షికోత్స వేడుకలు నిర్వహించి సుమారు 2000 మందికి అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీవల్లి ప్యాలస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రఖ్యాతదిగా, విలాసవంతమైన వారి వారి అభిరుచులకు తగిన విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపాంతరం చెంది. ఆహ్లాదం ప్రశాంతత కోరుకునే వారికి సువిశాలమైన సౌకర్యతమైనదిగా చెప్పవచ్చు. ఈ అపార్ట్మెంట్లో కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్, బాడీ జిమ్, వాకింగ్ ట్రాక్, హై వోల్టేజ్ జనరేటర్లు. నిరంతరం సీసీ కెమెరాల పరిరక్షణ కలిగి ఉన్నాయి. ( మెయింటెనెన్స్ ) ముఖ్యంగా 89 ఫ్లాట్స్ లో నివాసం ఉండే వారికి ఏ విధమైన అసౌకర్యం కలుగ కుండా ప్లాట్స్ లో మరియు బయట పనిచేసే సిబ్బందిని శుభ్రత. పరిశుభ్రత విషయంలో, సెక్యూరిటీ సిబ్బంది వాహన రాకపోకల. బయట వ్యక్తుల రాకపోకలలో నియంత్రణలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అందరి మన్నలను పొందేవాడు పర్యవేక్షకుడు మరియు సెక్రెటరీ లక్ష్మీ మోహన్ నిరంతరం సేవలందిస్తుంటారు, ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి సందర్భం ఒక ఉత్సవంలా సంవత్సరంలో వచ్చే వార్షిక పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది , శ్రీరామనవమి, పండుగలను అపార్ట్మెంట్స్ లో ఉన్న వారు అందరూ ఒకే కుటుంబంలా ఒకే వేదికపై కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తుంటారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎం ఎస్ ఎం ఎస్ కుమార్, సెక్రటరీ జక్కాల లక్ష్మీ మోహన్ రావు, జాయింట్ సెక్రెటరిలు వి కృష్ణమోహన్ రావు, పి.ఎం. ఎన్ మురళీకృష్ణ , కమిటీ సభ్యులు జి హేమలత, జి.ఎస్ రాజు మరియు అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author