శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి
1 min readప్రత్యేక పూజలో మంత్రి కొలుసు పార్థసారధి,లక్ష్మీ కమల దంపతులు
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : శ్రీపెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలనిమంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. కైకలూరు వెంచివున్న శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న కొలుసు పార్ధసారధి లక్ష్మి కమల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాలతో బాజా భజంత్రీ లతో మొదటగా మంత్రి దంపతులకు ఘనస్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ప్రసాదాలు అందించారు. తదనంతరం మంత్రి దంపతులకు దుశ్శాలువతో ఘనంగా సన్మానించిన వేద పండితులు అమ్మవారి ఆశీస్సులు అందించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కైకలూరు నియోజకవర్గ ప్రజలు, జిల్లా,రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.పెద్దింట్లమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలోని, జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు ప్రజలు సహకరించాలన్నారు.కోరిన కోరికలు తీర్చే , అమ్మవారు పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పాడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందాలన్నారు.అమ్మవారి ఆశీస్సులతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అంత మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు గ్రామ పెద్దలు అమ్మవారి ఆశీసులు పొందారు.