NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవోపేతంగా శ్రీ సూర్య దత్త గోరక్షణశాల గృహప్రవేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః శ్రీ సూర్య దత్త గోరక్షణశాల గృహప్రవేశం లో భాగంగా  ప్రాతఃకాలంలో  గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యమేళనం, ప్రధాన కలశ స్థాపన, మహాగణపతి హోమము, లక్ష్మీనారాయణ హోమము, వాస్తు హోమము, శ్రీ సూర్య పంచాయితన హోమము, పరివారదేవతా హోమము, మహా పూర్ణాహుతి నిర్వహించడం జరిగినది. తదనంతరం శ్రవణా నక్షత్ర శుభపుష్కరాంశమునందు ఉదయం 9-58 ని.. లకు)మన సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా వేద శాస్త్రములలో, పురాణములలో చెప్పబడిన విధముగా అత్యంత వైభవోపేతముగా వేద మంత్రముల నడుమ శ్రీ స్వామీజీ వారి సంకల్పానుసారముగా శ్రీ సూర్య దత్త గోరక్షణశాల గృహప్రవేశం నిర్వహించడం జరిగింది.ఈ సూర్య దత్త గోరక్షణ శాల పూజా కార్యక్రమంలో( మాజీ MLA S V. మోహన్ రెడ్డిగారు ధర్మపత్ని (CO OPERATIVE BANK CHAIRMAN) S V.విజయ మనోహరి (కర్నూలు  మేయర్)B Y. రామయ్య (కార్పొరేటర్) సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి శ్రీ శివరామకృష్ణ శ్రీదేవిల దంపతులు డాక్టర్ ఆంజనేయులుడాక్టర్ నగేష్ వర్మ డాక్టర్ కృష్ణమోహన్ నాగజ్యోతి ల దంపతులు ప్రకాష్ కృష్ణమూర్తి శ్రీమతే శ్రీ ప్రసాదరావు రమాదేవి దంపతులు పాల్గొనడం జరిగినది. గో  పూజా కార్యక్రమాల్లో విశేషంగా భక్తాదులు పాల్గొని గోమాతకు నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

About Author